స్వామి వివేకానంద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వామీ వివేకానంద

స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902),(బెంగాలీలో 'షామీ బిబేకానందో') సన్యాసము పుచ్చుకోకముందు నామము 'నరేంద్రనాథ్ దత్తా', వేదంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజము పై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందుత్వము, భారతదేశం చరిత్రలలో నే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ పరమహంస శిష్యుడిగా రామకృష్ణా మిషన్ ను రామకృష్ణా మఠము ను స్థాపించెను.

భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండు ల లో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి కలదు. పాశ్చాత్య దేశాల లో కి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి. తూర్పు దేశాల తత్త్వమును షికాగో లో జరిగిన ప్రపంచ జాతర లో పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్ లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగో లో అమెరికాలో ఇతర ప్రాంతాల లో ప్రజల అభిమానాన్ని చురగొన్నాడు.

ముఖ్య సూత్రములు తత్త్వములు

వివేకానందుడు గొప్ప ఆలోచకుడు. అతని ముఖ్య సమాజ సహాయములలో, అద్వైత వేదంతము నకు తత్త్వ శాస్త్రములో నే కాకుండా , సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాల లో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' (పేదవారి సేవ తో భగవంతుని సేవ) అనే పదాన్ని ప్రతిపాదించాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయములో కలిగే దివ్యజ్యోతి లో కలిసి పోతాయని తెలుసుకున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి, తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మానవ్య్లను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది.


అందరు తనవార నుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. వ్యక్తిగత మోక్షము పై వ్యామోహము ను కూడా వదిలివేసి, ఇతరులను బంధవిముక్తులను చెయ్యడమే మనిషికి జ్ఞానోదయము అని నమ్మిన మనిషి. రామకృష్ణా మిషన్ ను రామకృష్ణా మఠమును "వ్యక్తి మోక్షమునక, ప్రపంచ హితమునకు"(आत्मनॊ मोक्षार्थम् जगद्धिताय च)అనే నినాదము మీద స్థాపించెను.