బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ
బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ | |||
| |||
పదవీ కాలం జనవరి 1 1992 – జనవరి 1 1997 | |||
ముందు | Javier Pérez de Cuéllar | ||
తరువాత | కోఫీ అన్నన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కైరో, ఈజిప్టు | 1922 నవంబరు 14||
జాతీయత | ఈజిప్టు | ||
జీవిత భాగస్వామి | లియా మరియా బౌత్రోస్ ఘలీ | ||
మతం | కోప్తిక్ కిరస్తాని |
బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ (Boutros Boutros-Ghali) 1922, నవంబర్ 14న ఈజిప్టు రాజధాని నగరం కైరోలో జన్మించాడు. ఇతడు ఈజిప్టునకు చెందిన ప్రముఖ దౌత్యవేత్త మరియు ఐక్యరాజ్య సమితికి 6 వ ప్రధాన కార్యదర్శిగా 1992 జనవరి నుంచి 1996 డిసెంబర్ వరకు పదవిని నిర్వహించాడు.
బౌత్రోస్ ఘలి 1946లో కైరో విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. 1949లో పారిస్ విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి. పట్టా పొందినాడు. 1977 నుంచి ఈజిప్టు విదేశాంగ శాఖ సహాయమంత్రిగా పనిచేసాడు. ఐక్యరాజ్య సమితి వైపు వెళ్ళడానికి కొన్ని మాసాల ముందు విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రిగా వ్యవహరించాడు. విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్ కు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మెనాచెమ్ బిగిన్ ల మధ్య శాంతి ప్రయత్నాలు కొనసాగించాడు [1]. 1991లో బౌత్రోస్ ఘలీ ఐరాస ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికైనాడు. ఇతని పదవీకాలం సంక్లిష్తంగా గడిచింది. ముఖ్యంగా 1994లో సంభవించిన ర్వాండా దమనకాండలో 9 లక్షల మందికి పైగా హత్యకు గురైనారు. ఈ విషయంలో బౌత్రోస్ ఘలీ తీవ్రంగా విమర్శల పాలైనాడు. అంగోలా అంతర్యుద్ధం, యుగొస్లావ్ యుద్ధాలు కూడా ఇతని కాలంలోనే జరిగాయి. 1996లో రెండో పర్యాయం కొరకు ఈజిప్టు, గినియా బిస్సౌ, బోట్స్వానాతో సహా భద్రతా మండలి లోని 10 తాత్కాలిక దేశాలు ప్రతిపాదించిననూ అమెరికా వీటో ఉపయోగించి మరో పర్యాయం బౌత్రోస్ ఘలీకి అవకాశం ఇవ్వలేదు. రెండో పర్యాయం ఎన్నిక కాని మొదటి వ్యక్తిగా చరిత్రలో నిల్చిపోయినారు. అతని తర్వాత కోఫీ అన్నన్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు చేపట్టినాడు.