ఋష్యేంద్రమణి
ఋష్యేంద్రమణి ప్రముఖ తెలుగు రంగస్థల, సినిమా నటి.
ఈమె చిన్నతనంలోనే సంగీతాన్ని, నాట్యాన్ని అభ్యసించింది. కొమ్మూరి పట్టాభిరామయ్య యొక్క లక్ష్మీవిలాస నాటక సభలో చేరి కపిలవాయి రామనాథశాస్త్రి, పువ్వుల రామతిలకం వంటి ప్రసిద్ధ నటుల వద్ద శిక్షణ పొందింది. ఆనాడు రాజారావు నాయుడు నిర్మించిన శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో సత్యభామ పాత్రను పోషించింది. ఆ చిత్రం అపజయం పొందడంతో తిరిగి నాటకరంగంలో ప్రవేశించి ప్రహ్లాద, రాధాకృష్ణ, చింతామణి, తులాభారం మొదలగు నాటకాలలో ప్రముఖ పాత్రలు ప్రతిభావంతంగా పోషించింది. ఆనాడు కడారు నాగభూషణం, పసుపులేటి కన్నాంబ నడిపిన రాజరాజేశ్వరీ నాట్యమండలి బృందముతో మూడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించింది.
ఋష్యేంద్రమణి తన భర్త జవ్వాది రామకృష్ణారావు మాతృభూమి అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడానికి చెన్నై రావడంతో తానుకూడా చెన్నై చేరి పాండురంగ విఠల్ అనే చిత్రంలో దేవకన్య పాత్ర పోషించింది. అదే సమయంలో గూడవల్లి రామబ్రహ్మం తమిళ పంచ మహాకావ్యాలలో ఒకటైన శిలప్పాడికరం ఆధారంగా నిర్మించిన పత్ని చిత్రంలో కణగి పాత్ర ధరించింది. ఆ సినిమాలో కోవలన్ పాత్రను తెలుగులో సుప్రసిద్ధ దర్శక నిర్మాత కోవెలమూడి సూర్యప్రకాశరావు ధరించాడు. కణగి పాత్రను ఆమె అత్యద్భుతంగా పోషించింది. ఆ తరువాత చెంచులక్ష్మిలో ఆదిలక్ష్మి పాత్ర, సీతారామ జననంలో కౌసల్యగాను, సేతుబంధన్ లో ఇంద్రాణిగా, భక్త సిరియాళలో కథానాయకి పాత్రను ధరించి మెప్పించారు. ఈమె వీర, రౌద్ర రసాలను ఎంత ఉత్తేజంగా అభినయిస్తుందో, శోకభరిత కరుణారస ప్రధానమైన సాత్విక పాత్రలు కూడా అంతే ప్రతిభావంతంగా పోషించేది. మల్లీశ్వరిలో తల్లి పాత్రనూ, విప్రనారాయణలో వేశ్య పాత్రనూ, మాయాబజార్, జగదేకవీరుడు, అగ్గిరాముడు, కృష్ణ సత్య, పాండురంగ మహత్మ్యం మొదలగు ఘనమైన చిత్రాలలో వివిధ ప్రధాన పాత్రలు పోషించింది.
ఋష్యేంద్రమణి గారు 17 ఆగష్టు 2002 రోజున చెన్నైలో శాశ్వతంగా కన్నుమూశారు.
గాయనిగా ఋష్యేంద్రమణి
[మార్చు]ఈమె చలనచిత్రాలలోకి వచ్చేప్పటికి, నటీనటులకు వేరేవారు గాత్రంతో పాటలుపాడటఅనికి సాంకేతిక అభివృద్ధి జరుగలేదు. దాదాపుగా అందరు నటీనటులు తమ పాటలు తామే పాడుకొనేవారు. అదే వరవడిలో, ఋష్యేంద్రమణి తన పాటలను తానే పాడుకొనేది. గాయనిగా మంచి పేరు వచ్చింది. మాయాబజారు సినిమాలో అభిమన్యునితోపాటుగా వళ్తున్నప్పుడు వీరెవరో తెలియక ఘటోత్కచుడు వీరి మీద దాడిజరిపినప్పుడు, ఈమె పాడిన పద్యం/పాట ఇప్పటికికూడ ఎంతగానో ప్రాజదరణపొందుతున్న పాత పాటలలో ఒకటి.
నటించిన సినిమాలు
[మార్చు]- 1935: కృష్ణ తులాభారం (సత్యభామ)[1]
- 1942: పత్ని (కణ్ణగి)
- 1943: చెంచులక్ష్మి (ఆదిలక్ష్మి)
- 1944: సీతారామ జననం (కౌసల్య)[2]
- 1946: సేతుబంధనం (ఇంద్రాణి)
- 1948: భక్త శిరియాల (ఉమ)
- 1949: ధర్మాంగద
- 1951: మల్లీశ్వరి (నాగమ్మ)
- 1953: అమ్మలక్కలు
- 1954: అగ్గిరాముడు
- 1954: కాళహస్తి మహాత్యం
- 1954: చంద్రహారం (గౌరి సవతితల్లి)
- 1954: జాతక ఫలం (రంగారావు భార్య)
- 1954: విప్రనారాయణ (దేవదేవి తల్లి)
- 1954: సంఘం (రత్నం)
- 1955: మిస్సమ్మ
- 1955: విజయగౌరి
- 1956: చింతామణి (శ్రీహరి)
- 1957: పాండురంగ మహత్యం (లక్ష్మి)
- 1957: మాయాబజార్ (సుభద్ర)
- 1957: సతీ సావిత్రి
- 1957: స్వయం ప్రభ
- 1958: గంగా గౌరీ సంవాదం (రుద్రమ్మ)
- 1958: బొమ్మల పెళ్లి
- 1960: దేసింగురాజు కథ
- 1960: దీపావళి (అదితి)
- 1960: మాంగల్యం
- 1960: విమల
- 1960: శ్రీ వెంకటేశ్వర మహత్యం (ధరణీదేవి)
- 1961: జగదేకవీరుని కథ (రాణి)
- 1961: టాక్సీ రాముడు
- 1961: బికారి రాముడు
- 1962: గుండమ్మ కథ
- 1962: గులేబకావళి కథ (గుణవతి)
- 1962: మురిపించే మువ్వలు
- 1963: ఆప్తమిత్రులు (శాంతమ్మ)
- 1963: చిత్తూరు రాణీ పద్మిని
- 1963: శ్రీకృష్ణార్జున యుద్ధము (గయుని భార్య)
- 1964: రామదాసు
- 1964: రాముడు భీముడు
- 1965: ఆడ బ్రతుకు (ఆయా)
- 1965: చదువుకున్న భార్య
- 1965: పాండవ వనవాసం
- 1965: ప్రమీలార్జునీయము
- 1966: నవరాత్రి
- 1966: పిడుగురాముడు
- 1966: శ్రీకృష్ణ తులాభారం
- 1967: గృహలక్ష్మి
- 1967: భామావిజయం
- 1967: శ్రీకృష్ణావతారం (కుంతీదేవి)
- 1968: ఉమా చండీ గౌరీ శంకరుల కథ
- 1968: పాప కోసం
- 1968: భాగ్యచక్రం (విక్రమ్ తల్లి)
- 1969: సత్తెకాలపు సత్తెయ్య (అమ్మమ్మ)
- 1969: సిపాయి చిన్నయ్య (బామ్మ)
- 1971: శ్రీకృష్ణసత్య
- 1971: సంపూర్ణ రామాయణం (రావణుని తల్లి)
- 1972: అంతా మన మంచికే
- 1982: అనురాగ దేవత
- 1984: శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
- 1986: శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం
ఇవీ కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ డైలీహంట్ (ఈనాడు), సినిమా (26 May 2020). "జనానికి ఇవేమీ అక్కర్లేదు". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 9 August 2020.
- ↑ The Hindu, Cinema (25 February 2012). "Blast From The Past: Sri Sita Rama Jananam (1944)" (in Indian English). M.L. Narasimham. Archived from the original on 18 September 2019. Retrieved 29 September 2020.
{{cite news}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 20 జూన్ 2018 suggested (help)